శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (16:19 IST)

కరోనా వైరెస్ ఎఫెక్ట్, ఆర్థిక సంక్షోభంలో అన్నవరం సత్యదేవుని దేవస్థానం

కరోనా ఎఫెక్ట్ సత్యదేవునిపై పడింది. అన్నవరం ఆదాయం సన్నగిల్లింది. కనీసం అద్యోగులు, సిబ్బందికి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేక పోతున్నాయి. భక్తులు రాక ఆదాయం లేక ఆలయ నిర్వహణ కష్టతరంగా మారింది. మరీ ఆలయానికి ఆర్థిక సంక్షోభం తీరేదెలా అనే ఆలోచనలో అధికారులు సతమతమవుతున్నారు.
 
సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రత్నగిరి రూమ్‌ల అద్దెలు, దర్శనాల టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు  మరియు హుండీ ద్వారా ఆదాయాలు మెండుగా వచ్చేవి. ప్రస్తుతం కరోనా కారణం వల్ల అది సంక్షోభంగా మారింది. ప్రతి రోజు 25 నుంచి 35 లక్షల మధ్య ఆదాయం వచ్చేది. అది ప్రస్తుతం 3 లక్షలకే పరిమితమయ్యాయి. ఇప్పుడున్న ఆదాయం ఆలయ నిర్వహణకు సరిపోవడం లేదు.
 
ఆలయంలో రెగ్యులర్, పొరుగు సేవలు కింద 720 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ లెక్కలకు తీసుకుంటే దాదాపు నెలకు 3 కోట్లు అవుతుంది. ఇటీవల సత్యదేవుని దర్శనం కోసం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చారు. ఉద్యోగులు తమకు పూర్తి స్థాయిలో జీతమివ్వాలని కోరగా మంత్రి ఈవోను నిలదీసారు.
 
దీంతో స్వామివారి మీద ఉన్న డిపాజిట్లను విత్ డ్రా చేస్తే అందరికి పూర్తి జీతాలు ఇవ్వగలుగుతామని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయాలని ఈవోకు తెలిపారు. అయితే ఈ విషయంపై కమిషనర్ ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అని అధికారులు, సిబ్బంధి  ఎదురుచూస్తున్నారు