గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (19:41 IST)

డాన్సర్ గాయత్రి కేసులో ట్విస్ట్: వాట్సప్ స్టేటస్‌లో నా భర్త ఫోటో పెట్టింది, అడిగానంతే.. నీలిమ

విజయవాడ వాంబే కాలనీలో మొన్న ఆత్మహత్యకు పాల్పడిన డాన్సర్ గాయత్రి కేసులో ట్విస్ట్ బయటపడింది. ఆమె తన భర్త బన్నీ ఫోటోను వాట్సప్ స్టేటస్‌లో పెట్టిందనీ, దానిపై నిలదీసేందుకే ఆమె ఇంటికి వెళ్లాను తప్పించి మరొకటి ఏమీ లేదని చెప్పింది నీలిమ.
 
గతంలో కూడా తన భర్తకు దూరంగా వుండాలని చెప్పాననీ, ఒకవేళ తన భర్తే కావాల్సి వస్తే నువ్వు అతడితో వుండు నేను దూరంగా వెళ్లిపోతానని కూడా చెప్పానని వెల్లడించింది. ఐతే అందుకు గాయత్రి అంగీకరించలేదని చెప్పుకొచ్చింది.
 
బన్నీతో వివాహేతర సంబంధంపై ఆమె భర్త కొట్టినట్లు తనకు ఫోన్ చేసి చెప్పిందని వెల్లడించింది. ఐతే గాయత్రి ఇంటికి వెళ్లిన మాట నిజమే కానీ ఆమెతో తను ఎలాంటి గొడవ పడలేదని చెప్పింది. ఆమె ఆత్మహత్ ఎందుకు చేసుకున్నదో తనకు తెలియదని చెప్పింది నీలిమ. అసలు ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమిటో పోలీసులు తేల్చాలని విజ్ఞప్తి చేసింది.