శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (10:41 IST)

వివాహేతర సంబంధం.. కుమార్తెపై లైంగిక దాడి.. కసాయి తల్లి అరెస్టు..!

సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తల్లి పదానికే కళంకం తెచ్చిందో మహిళ. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి చేత కన్న కుమార్తెపై లైంగిక దాడి చేయించింది ఓ కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా శివంపేట్ ఉంటున్న ఓ మహిళకు అదే జిల్లాలో ఉంటున్న ఓ వ్యక్తితో వివాహం జరిగింది. 
 
వారికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే మనస్పర్ధల కారణంగా ఆమె భర్తతో విడిపోయింది. భర్త దగ్గరే కుమార్తెను కూడా వదిలేసింది. ఆ తర్వాత కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ హరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
గతేడాది కుమార్తెను కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో చదివించేందుకు తీసుకువచ్చిన ఆ మహిళ, తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ను కన్న కుమార్తెపై ఉసిగొల్పింది. దీంతో రెండు రోజుల క్రితం బాలికను చెరబట్టాడు హెడ్ కానిస్టేబుల్ హరి. అత్యాచారానికి గురైన బాలిక ఛైల్డ్ లైన్ ను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
ఛైల్డ్ లైన్ ఫిర్యాదుతో కానిస్టేబుల్ హరిని, బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.