శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (16:48 IST)

ఆ కుటుంబాన్ని వడ్డీ వ్యాపారులు చంపేశారు.. కంచీలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్య!

పెళ్లీడుకొచ్చిన కుమార్తెకు వివాహం చేయలేకపోయామన్న మనోవేదన ఒకవైపు. అప్పుల్లో చిక్కుకున్న కుటుంబాన్ని గట్టుకు చేర్చలేక పోయామన్న బాధతో కుమార్తెతో పాటు.. ఆ కుటుంబంలోని నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన వ

పెళ్లీడుకొచ్చిన కుమార్తెకు వివాహం చేయలేకపోయామన్న మనోవేదన ఒకవైపు. అప్పుల్లో చిక్కుకున్న కుటుంబాన్ని గట్టుకు చేర్చలేక పోయామన్న బాధతో కుమార్తెతో పాటు.. ఆ కుటుంబంలోని నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాంచీపురం సమీపంలోని కట్టుపత్తూరు గ్రామానికి చెందిన ముత్తు (58), సరస్వతి (50) అనే దంపతులకు కామేష్ (25), ఇందుమతి (28) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముత్తుది రైతు కుటుంబమైనప్పటికీ కష్టపడి ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. ఇందుమతి బీఏ, బీఈడీ పూర్తి చేసి శ్రీపెరంపుదూర్ తాలూకాలోని మధురమంగళం గ్రామానికి వీఏవోగా నియమితులైంది. 
 
అంతా సజావుగా సాగుతున్న వీరి కుటుంబానికి ఇందుమతి వివాహం సమస్యగా మారింది. కూతురు పెళ్లి చేయడానికి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయాలని ముత్తు నిర్ణయించి.. వారిని రుణం ఇవ్వాలని కోరాడు. ఇద్దరు పిల్లల చదువుల కోసం తీసుకున్న అప్పు తిరిగిస్తేగానీ కొత్త అప్పు ఇవ్వమని తేల్చి చెప్పారు. పైగా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇందుమతికి పెళ్లిచేస్తే అప్పు ఎలా తీరుస్తావంటూ ముత్తును వడ్డీ వ్యాపారులు ప్రశ్నించారు. 
 
దీంతో తన తమ్ముడు కామేష్‌కు ఉద్యోగమొచ్చేదాకా పెళ్లి చేసుకోనని వడ్డీవ్యాపారులకు చెప్పింది. అయితే, ఇంట్లో నెలకొన్న అశాంతికి తన పెళ్లే కారణమని భావించిన ఇందుమతి గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన ముత్తు, సరస్వతి, కామేష్‌లు కూతురులేని జీవితం తమకెందుకని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. లోపల నలుగురు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.