శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (20:32 IST)

వాడిని వదలొద్దు... చిత్తూరు జిల్లా ఎస్పీకి వాసిరెడ్డి వినతి

చిత్తూరు జిల్లాలో దారుణ హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి వర్షిత కుటుంబాన్ని అంగళ్లు గ్రామానికి వెళ్ళి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అక్కడే ఉన్న దర్యాప్తు అధికారి మదనపల్లి రూరల్ సి.ఐ.ని ఘటన గురించి అడిగి తెలుసుకున్నార. నిందితుడు పాపతో అదృశ్యమయిన వెంటనే సి.సి. టి.వి పుటేజిని పరిశీలించార లేదా అని అడిగారు.

సి.సి. టి.వి పుటేజిని పరిశీలించిన తరువాత ఒక వ్యక్తి ఆ పాపని ట్రాప్ చేసి బయటకి తీసుకువెళ్లడం, ఏమాత్రం జంకు లేకుండా పాపను తీసుకెళ్లిన దృశ్యాలను చూసిన తరువాత ఆ వ్యక్తి ఇలాంటి నేరాలు చెయడానికి అలవాటుపడిన దుర్మార్గుడులా కనిపిస్తున్నాడని, వెంటనే పట్టుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్.పి.తో మాట్లాడి ఇటువంటి కేసులు ఛేదించిన అనుభవం వున్న సాంకేతిక నిపుణులని తక్షణం సంప్రదించాలని నిందితుడు దొరికేవరకు పట్టువిడువరాదని ఎస్.పి.ని కోరారు.

అనంతరం ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఈ దారుణ సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పోలీసు ఉన్నతాధికారులతో తక్షణమే మాట్లాడించాలని కోరారు. అవసరమయితే కొత్త పద్దతులను అన్వేషించి నిందితుడిని పట్టుకోవాలని ముఖ్యమంత్రిని మహిళా కమిషన్ కోరింది.

ఆ గ్రామ ప్రజలు, మహిళలు, స్కూలు విద్యార్థులు, ఉపాద్యాయులు మరియు ప్రజా సంఘాల నేతలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమములొ స్థానిక తంబళ్లపల్లి ఎం.ఎల్.ఎ. పెద్దిరెడ్డి  ద్వారకానాధ్ రెడ్డి పాల్గొని బాదిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిదాలా అండదండలు అందిస్తుందని ఇటువంటి కేసుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా చూడాలని కృతనిశ్చయంతో వున్నారని పద్మ అన్నారు.