Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నతల్లిని చంపేశాడు... ఎందుకో తెలుసా?

బుధవారం, 3 జనవరి 2018 (09:02 IST)

Widgets Magazine
subrhamanyam

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి.. కన్నతల్లిని చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? తాగుడు డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిత్తూరు జిల్లా వి.కోట మండలం శివునికుప్పం కాలనీకి చెందిన బాలెమ్మ(48), రామకృష్టప్ప గౌడ్‌ దంపతులకు సుబ్రహ్మణ్యం అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన సుబ్రహ్మణ్యం కన్నతల్లిని డబ్బులు ఇవ్వమని వేధిస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం రోజున డబ్బులు ఇవ్వాలని తల్లిని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సుబ్రహ్మణ్యం కన్నతల్లిని దుప్పటితో ఉరివేసి హత్యచేశాడు. 
 
మంగళవారం బాలెమ్మ ఎంతసేపటికీ లేవకపోవడంతో ఆమె మనవరాలు భార్గవి పక్కింటి వారికి చెప్పింది. దీంతో హత్య విషయం వెలుగుచూసింది. తాగి వచ్చిన మామ (సుబ్రహ్మణ్యం) రాత్రి అవ్వతో డబ్బులివ్వమని గొడవపడ్డాడని, తాను భయంతో పక్కింట్లోకి వెళ్ళానని భార్గవి చెప్పింది. దీంతో గ్రామస్థులంతా కలిసి సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఉన్న సుబ్రహ్మణ్యాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత బాలెమ్మ భర్త రామకృష్ణప్ప గౌడ్‌ ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సుబ్రహ్మణ్యం గతంలో వావివరసలు మరిచి తల్లిని, చెల్లిని కోరిక తీర్చాలని వేధించేవాడని గ్రామస్థులు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రిపుల్ తలాక్‌ గట్టెక్కేనా? నేడు రాజ్యసభకు...

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ...

news

ప్లీజ్ పవన్.. తెలంగాణ నుంచి పోటీ చేయొద్దు.. ఎవరు?

తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడం హాట్ ...

news

కన్నతల్లిపై అత్యాచారం.. దారుణ హత్య.. చెల్లెల్ని కూడా...

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై ...

news

పక్కా ఆధారాలున్నాయ్... అందుకే గజల్ శ్రీనివాస్ అరెస్ట్

'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేయడానికిగల కారణాలను హైదరాబాద్ పంజాగుట్ట ...

Widgets Magazine