శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 30 జులై 2014 (17:16 IST)

ఎర్ర దొంగలుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు...

ఎర్రచందం స్మగ్లర్లు కొత్త పంధాలో ముందుకు వెళ్లుతున్నారు.. స్మగ్లర్‌లు అంటూ మొరటుగా ఉంటారు చదువూసంధ్యా లేకుండా ఉంటారు అనుకునేరు. ఇప్పుడు స్మగ్లర్‌లు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. కారు ముందు సీట్లో కూర్చుని లాప్‌టాప్‌లో మెయిల్స్ చేసుకుంటూ తమ పని కానించేస్తున్నారు. సూటుబూటు చక్కనైన ఇంగ్లీష్ మాట్లాడే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వైనమిది. హైదరబాద్ నుంచి కార్లు అద్దెకు తీసుకుని పోయి  వాటి ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
 
హైదరబాద్‌లో చదువుకునే విద్యార్థులను ఎంచుకుని వారి ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. హైదరబాద్‌లోని ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులను ఈ స్మగ్లింగ్ రొంపిలొకి దించుతున్నారు. లావిష్ లైఫ్‌కు అలవాటుపడిన విద్యార్థులను ఎంచుకుని ఈ స్మగ్లింగ్ చేయించుతున్నారు.
 
కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన తేజ్‌రాజ్, హైదరబాద్ లోని సిఎమ్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నారు. ఇతని తండ్రి రాయలసీమలో ప్రముఖ కాంట్రాక్టర్. హైదరబాద్‌కు వచ్చిన తరవాత లావిష్ లైఫ్‌కు తేజ్ రాజ్ అలవాటుపడ్డారు. తండ్రి పంపించే డబ్బులు సరిపోక పోవడంతో అక్రమ మార్గం వైపు దృష్టి మార్చుకున్నాడు.
 
ఇందులో భాగంగా హైదరబాద్ నుంచి అద్దెకు ఇన్నొవా కార్లు, స్విప్ట్ డిజైర్ లాంటి కార్లను తీసుకొని చిత్తూరు జిల్లాలోనే పలు మండల్లాలో దొరికే ఎర్రచందనంను ఈ వాహనంలో వేసుకునే వారు. దానిని తీసుకుని రెండు చెక్ పోస్టులు దాటించి కర్నాటక లోని హొసూరు పోర్టుకు చేరుకునేవారు. 
 
అక్కడ వున్న చోటాభాయ్ మనుషులైన ఇద్దరికీ ఈ చందనం చెక్కలను అందించేవారు. ఇలా చేసినందుకు తేజ్‌రాజ్‌తో పాటుగా అతనితో పాటుగా వున్న యువకులకు ప్రతి ట్రిప్‌‌కు పదివేల చొప్పున ఇచ్చేవారని పోలీసులు అంటున్నారు. తనకు అప్పగించిన ప్రాంతానికి ఎర్రచందనం చేర్చడమే అతని పని. ఇప్పటివరకు కొన్ని వందల టన్నుల ఎర్రచందనంను తేజ్‌రాజ్ కర్నాటకలోని ఛోటాబాయ్‌కి అందించినట్లుగా తేలింది. 
 
పోష్‌గా వుంటే తమను చెక్‌పోస్టుల వద్ద ఎవరు కూడా చెక్ చేయలేదని ఇందువల్ల తాము స్వేచ్ఛగా ఎర్రచందనం కర్నాటకకు తరలించామని.. ఈ యువ ఇంజనీరింగ్ స్మగ్లర్లు అంటున్నారు.