కరోనాతో చనిపోయినా ఆ అర్చకుడికి శ్రీవారి ఆలయం నుంచి మర్యాదలు, ఎలా వచ్చాయి..?
తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారప్యంగా కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం జరుపవలసిన మర్యాదలు జరుపబడతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కరోనాతో మరణించిన శ్రీనివాసమూర్తి దీక్షితుల అంత్యక్రియల సంధర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో సంప్రదాయ ఆచారం నిర్వహించి గౌరవించారు.
ఇందుకోసం చందనపు కర్ర, వరివట్టం, నిప్పులను తీసుకుని డోలు, నాదస్వరం, వాయిస్తూ పంచముఖం పోటు నుంచి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా సిబ్బంది, అర్చకులు శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్ళారు.
అక్కడ శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు తరపున వచ్చిన వారికి వీటిని ఆలయ డిప్యూటీ ఈఓ అందించారు. వీటిని మరణించిన మాజీ ప్రధాన అర్చకుని అంత్యక్రియల కోసం వినియోగించారు.