ఎక్సైజ్ కానిస్టేబుల్.. నవ మన్మథుడు.. 8 మందితో అక్రమ సంబంధం..

Extra Marital Affairs
జె| Last Modified శనివారం, 8 డిశెంబరు 2018 (21:38 IST)
అతనో ఎక్పైజ్ కానిస్టేబుల్. అంతకన్నా మించిన విలాస పురుషుడు. చిత్తూరు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్లో ఉద్యోగం. దీంతో రాబడికి కొదవేలేదు. ఈ మాత్రం చాలు చెలరేగిపోవడానికి అనుకున్నాడు. పెళ్ళాం పిల్లల్ని నడిరోడ్డు పాలుచేసి సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. పెళ్ళాం పిల్లల్ని చిత్ర హింసలు చేసినా అడిగేవాళ్లు లేరు. అంతేకాదు డిపార్టుమెంట్లో విషయం తెలిసినా పట్టించుకోలేదు. భార్య ఎన్నిసార్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం.

చిత్తూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ రామలింగయ్య. ఇతను సామాన్యుడు కాదు. కానిస్టేబుల్‌గా ఎంతటి సామర్థ్యం చూపుతున్నాడో తెలియదు కానీ కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టడంలోను, ఇతరుల భార్యలతో వివాహేతర సంబంధాలు నడపడంలో మాత్రం ఎక్పర్ట్. ఇతనికి శ్రీవల్లి అనే మహిళతో 2000 సంవత్సరంలో పెళ్ళయ్యింది. వీళ్ళకు ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు డిగ్రీ, మరొకరు టెన్త్ చదువుతున్నారు. గత నాలుగేళ్ళ నుంచి రామలింగయ్య ఒక నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడు.

అంతేకాదు మరో ఏడుమందితో చిత్తూరు నగరంలోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందరూ వివాహమైన వారే. వారితో సన్నిహితంగా ఉండడమే కాదు. ఆ దృశ్యాలను వీడియోలు తీస్తాడు. ఆ తరువాత బెదిరించి వారిని లైంగికంగా అనుభవించడం రామలింగయ్యకు అలవాటు. గత సంవత్సరం నుంచి పోలీస్టేషన్ల చుట్టూ, ఎక్సైజ్ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగింది రామలింగయ్య భార్య శ్రీవల్లి. అయితే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో చివరకు చేసేది లేక మీడియాను ఆశ్రయించింది. దాంతో ఎక్సైజ్ పోలీస్ వ్యవహారం బట్టబయలైంది.దీనిపై మరింత చదవండి :