Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐటీ ఉద్యోగాల కోసం రూ.లక్ష.. 70మంది మోసపోయారు.. అవెన్యూ బండారం బయటపడింది..

మంగళవారం, 13 జూన్ 2017 (13:28 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో ఐటీ ఉద్యోగాలంటేనే వద్దు బాబోయ్ అంటూ జడుసుకుంటున్న తరుణంలో.. లక్షల్లో డబ్బులు కట్టి మరీ ఐటీ జాబ్స్ కొనుక్కుంటున్నారు. డొల్ల కంపెనీలు పుట్టుకురావడంతో.. యువత డబ్బు కట్టి మరీ జాబ్స్ సంపాదించుకుంటున్నారు. ఐతే డబ్బు కట్టి మోసపోయిన 70 మంది బాగోతం ప్రస్తుతం బయటపడింది. 
 
ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత... బోర్డు తిప్పేస్తున్న తరుణాలెన్నో వున్నాయి. తాజాగా హైదరాబాదులోని ఓ సంస్థ చేసిన మోసానికి చాలామంది టెక్కీలు రోడ్డునపడ్డారు. అవెన్యూ ఐటీ కంపెనీ అనే సంస్థ ఐటీ ఉద్యోగాలిప్పిస్తానని 70 మంది వద్ద తలా లక్ష రూపాయలను వసూలు చేసింది. తొలి నెల జీతం కూడా బాగానే వచ్చింది. కానీ రెండో నెల మాత్రం అవెన్యూ సంస్థ బోర్డు తిప్పేసింది. 
 
ఇంటర్వ్యూలు, ఆఫర్ లెటర్స్ ఇచ్చినా.. జాబ్‌లో డాయిన్ అయిన రెండో నెల నుంచి ఉద్యోగులకు జీతాలు అందలేదు. గట్టిగా నిలదీస్తే.. యాజమాన్యం చేతులెత్తేసింది. పైగా ఆఫీసుకు తాళాలేసేయడంతో.. ఉద్యోగులకు ఏమి అంతు పట్టలేదు. ఫోన్ చేసి అడిగితే.. ప్రాజెక్టులు లేవని నిర్లక్ష్య సమాధానం.
 
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్‌ ఏక్తా టవర్‌ లో ఈ అవెన్యూ కంపెనీ ఉంది. జగదీశ్ అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం దీన్ని నెలకొల్పాడు. నిరుద్యోగ యువతీ యువకులను ఆకర్షించి సుమారు 70మంది చేత తలా రూ.1లక్ష నుంచి లక్షన్నర వరకు కట్టించుకున్నాడు. అంతా నెలరోజులు బాగానే గడిచింది. రెండో నెల నుంచి సంస్థ బోర్డు తిప్పేసింది. జీతాలు లేవని చెప్పేసింది. 
 
ఈ వ్యవహారంపై నల్గొండకు చెందిన మాడ్గుల గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ విజయవాడకు చెందిన కోతూరి కార్తీక్‌ (26), కంప్యూటర్స్‌ మెయింటెనెన్స్‌ చేసే ఖమ్మం జిల్లాకు చెందిన వల్లభరెడ్డి ఫణీంద్ర కుమార్‌ (28) లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hyderabad Software Interviews Fake It-company

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడితో చాటింగ్... భర్త తన వాట్స్ యాప్ చూసాడని నరికేసింది...

భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ...

news

శశికళ అంత ఖర్చు చేసిందా? ఎమ్మెల్యేలకు రూ.6కోట్లు.. స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాల ఫైర్..

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత ఆమె స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ ...

news

ప్రేమించానని.. ఒకరోజు రాత్రంతా గడిపి.. ఆ తరువాత(వీడియో)

ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సాధారణమైపోయింది. ఒకరు ఇద్దరు కాదు. ఎంతోమంది అమ్మాయిలు ...

news

డయానా పెళ్లైన పది రోజుల్లోనే ఆ పని చేసిందా? పెళ్లైన ఏడాదిలోనే మృతి.. వీడని మిస్టరీ...

బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1996 ఆగస్టు 28న ...

Widgets Magazine