కన్నబిడ్డ చెప్పిన మాట వినడం లేదనీ... తలకిందులుగా చెట్టుకి వేలాడదీత.. కసాయి తండ్రి క్రౌర్యం

సోమవారం, 20 మార్చి 2017 (08:23 IST)

sadist

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదాడు. ఇంతకీ ఆ బిడ్డ చేసిన పాపం ఏంటో తెలుసా... తండ్రి చెప్పిన మాట వినకపోవడమే. దీనికి ఆ కసాయి తండ్రి వేసిన కఠిన శిక్ష తలకిందులుగా చెట్టుకు వేలాడదీయడం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు సుబ్బారాయుడు కాలనీకి చెందిన నల్లపూసల శ్రీను అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చేపలు, చేలలో ఎలుకలను పట్టుకుని జీవించే శ్రీను మద్యంతాగొచ్చి భార్యా పిల్లలను హింసిస్తుంటాడు. శ్రీను రెండో కుమార్తె (9) మేరీని శనివారం కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకొమ్మకు వేలాడదీశాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని మందలించి మేరీని విడిపించారు. అయితే బాలికకు వాతలు పెట్టినట్లు తెలియడం, శ్రీను మళ్లీ గొడవ చేస్తుండటంతో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు స్థానిక పోలీసులతో చ్చి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కుమార్తె తన మాట వినకపోవడం వల్లే చెట్టుకు వేలాడదీసి, వాతలు పెట్టినట్టు అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సముద్రమార్గంలో 400 కోట్ల దొంగనోట్లు: రూ.2వేల నోట్లంటనే వణుకుతున్న జనం

ఒకటా రెండా.. మూడా.. నాలుగు వందల కోట్ల రూపాయల దొంగనోట్లు కంటైనర్ల ద్వారా చెన్నై హార్బర్‌కు ...

news

ఇక్కడ మాత్రం మోదీ పప్పులుడకవు.. ఎందుకనీ...?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఘనవిజయాలు సాధించినప్పటికీ, అక్కడ మాత్రం తన పప్పులింకా ఉడకనందుకు ...

news

జగన్ కంచుకోటలో టీడీపీ పాగా వేసేనా? నేడే స్థానిక ఫలితాలు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా టీడీపీ ప్రాభవంలోకి ...

news

అమెరికా వెళ్లాలంటే విద్యార్థుల భయం.. షాక్‌లో అమెరికా విద్యాా సంస్థలు

జాతి విద్వేష దాడులు, ట్రంప్‌ కఠిన వలస విధానాల నేపథ్యంలో.. అమెరికా కాలేజీల్లో చేరే విదేశీ ...