శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2015 (14:10 IST)

కుప్పకూలిన చర్చి: ఐదుగురు క్రైస్తవులు మృతి!

చర్చి కుప్పకూలడంలో ఐదుగురు క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలో కుప్పకూలిపోవడంతో పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆగ్నేయ నైజీరియాలో ఈ సంఘటన జరిగింది.

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనుగు రాష్ట్రంలోని ఓడుమా పట్టణంలో సెయింట్ ఆంథోణి చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు. అర్దగంట తరువాత చర్చి ఒక్క సారిగా కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. 
 
చర్చి కూలిపోయే సమయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారని ఇసాక్ ఎంబా పోలీసులకు తెలిపాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలు బయటకు తియ్యడానికి నానా ఇబ్బంది పడ్డారు.

గత వారం రోజుల నుండి ఎనుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగానే చర్చి కూలిపోయిందని పోలీసు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసింది. అయినప్పటికీ విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.