శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (08:20 IST)

ఐదుగురు కొడుకులున్నారు.. ! ఆదరించే దిక్కు ఎవరు ? ఎక్కడ?

ఐదుగురు కొడుకులు... ముగ్గురు కుమార్తెలు.. అందరిని పెంచి పెద్ద చేశారు. వారి పెళ్ళిళ్లు కూడా చేశారు. అయినా ఆయనకు పట్టెడన్నం పెట్టే కొడుకు లేడు. దరి చేర్చుకునే కూతురు లేదు. తీవ్ర వేదనతో ఓ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడబోయాడు. నేనెందుకు బతకాలి.? ఎవరి కోసం బతకాలి.? అందుకే చచ్చిపోవాలని అనుకుని ఇలా వచ్చా అంటూ 75 ఏళ్ల ఓ వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆదివారం కొవ్వూరు-రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.  
 
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పాడిచెట్టు రమణసుబ్బారావు (75)కు ఇద్దరు కుమారు లు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తనను కన్నకొడుకులు ఆదరించకపోగా ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా కూడా అందకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
సుబ్బారావు బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకబోతుండగా గమనించిన వి.సుధాకర్‌ అనే వ్యక్తి తోటి ప్రయాణికుల సహాయంతో అడ్డుకున్నాడు. తర్వాత ఆ వృద్ధుడిని కొవ్వూరు పోలీ‌స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.