శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:35 IST)

ఒక్క చావు వంద మందిని భయపెట్టాలి.. నా పేరు మార్మోగిపోవాలి.. ఇదీ నయీం హత్యాకాండ స్టైల్

'ఒక్క చావు వంద మందిని భయపెట్టాలి. చచ్చిన మనిషి శరీర భాగాలు ఒక్కో ప్రాంతంలో సంచలనం రేపాలి. నా పేరు మార్మోగేలా ఒక్కో జిల్లాలో శరీర భాగాలు పడేయాలి'.. ఇదీ నయీం తన హత్యాకాండకు ఎంచుకున్న విధానం.

'ఒక్క చావు వంద మందిని భయపెట్టాలి. చచ్చిన మనిషి శరీర భాగాలు ఒక్కో ప్రాంతంలో సంచలనం రేపాలి. నా పేరు మార్మోగేలా ఒక్కో జిల్లాలో శరీర భాగాలు పడేయాలి'.. ఇదీ నయీం తన హత్యాకాండకు ఎంచుకున్న విధానం. చావంటే ఇంత దారుణంగా ఉంటుందా? అని జనం వణికిపోవాలి అనేది నయీం సిద్ధాంతం. ఇదే విధానాన్ని ఐపీఎస్ అధికారి వ్యాస్, బెల్లి లలిత అనే మహిళను హత్య చేసేందుకు ఉపయోగించాడు.
 
ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను కాల్చిన సమయంలో కూడా ఇదే క్రూరత్వాన్ని అమలు చేశాడు. వ్యాస్‌ చనిపోయిన తర్వాత కూడా రెండోసారి కంట్లో కాల్చాడు. ఈ హత్యాకాండ 1993 సంవత్సరంలో జరిగింది. వ్యాస్‌తో పాటు ఉన్న మరో ఐపీఎస్, గన్‌మెన్లు పారిపోయారు. వ్యాస్ చనిపోయాడని భావిస్తుండగా కొంతదూరం వెళ్లిన నయీం మళ్లీ వెనక్కి వచ్చి వ్యాస్ కుడి కంటిలో నుంచి మెదడులోకి దూసుకెళ్లేలా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో మరోసారి కాల్చాడు. దీనివల్ల క్షణాల్లో వ్యాస్ మృతి చెందాడు.
 
అలాగే, 1996లో తాను జైల్లో ఉంటూనే తన అనుచరులతో బెల్లి లలితను అతి కిరాతకంగా హత్య చేయించాడు. లలిత దేహాన్ని 16 ముక్కలుగా గొడ్డలితో నరికించి ఆ దేహభాగాలను వివిధ ప్రాంతాల్లో ఉన్న 16 బావుల్లో పడేయించాడు. పోలీసులు సోదాలు చేస్తే 80 శాతం దేహభాగాలు మాత్రమే దొరికాయి. పూర్తి దేహభాగాలను కూడా దొరకనివ్వకుండా మావోయిస్టులకు సవాల్ విసిరాడు. 
 
మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి నయీంతో జతకట్టిన బయ్యపు సమ్మిరెడ్డి హత్య కూడా అత్యంత కిరాతకంగానే జరిగింది. సమ్మిరెడ్డితో ఆరు నెలల పాటు సెటిల్‌మెంట్లు, దందాలు బాగానే జరిగినా.. ఆ తర్వాతే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తానే గ్యాంగ్‌కు లీడర్‌నని సమ్మిరెడ్డి ప్రచారంచేసుకోవటంతో ఆగ్రహానికి గురై అతడిని దారుణంగా చంపించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కృష్ణా జిల్లాలోని 22 ప్రాంతాల్లో చేసి పడేశాడు. ఇప్పటివరకు కొన్ని ముక్కలు దొరుకలేదని పోలీసులు చెప్తున్నారు.