Widgets Magazine

'గజల్' శ్రీనివాస్ అరెస్టు... ఎందుకో తెలుసా?

ప్రముఖ గజల్ కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ అరెస్టు అయ్యారు. ఆయనను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఓ మహిళా రేడియో జాకీ ఇచ్చిన లైంగికవేధింపుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్

ghajal srinivas
pnr| Last Updated: మంగళవారం, 2 జనవరి 2018 (13:21 IST)
ప్రముఖ గజల్ కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ అరెస్టు అయ్యారు. ఆయనను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఓ మహిళా రేడియో జాకీ ఇచ్చిన లైంగికవేధింపుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 'ఆలయవాణి' అనే వెబ్ రేడియోలో కుమారి అనే యువతి రేడియో జాకీగా పని చేస్తోంది. ఈ వెబ్ రేడియోకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 27వ తేదీన ఆమె సీసీఎస్ పోలీసులకు లిఖితపూర్వకంగానే కాకుండా, పలు ఆధారాలను, హార్డ్‌డిస్క్‌లను అందజేశారు.

ఈ ఆధారాలన్నింటినీ గత నాలుగు రోజులుగా పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి గజల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గజల్ శ్రీనివాస్ గత కొంతకాలంగా తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారనీ అందువల్లే అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.


దీనిపై మరింత చదవండి :