శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (11:13 IST)

ఉద్యోగమిప్పించి ప్రేమించాడు.. సహోద్యోగితో సన్నిహితంగా ఉండటంతో చంపేశాడు...

సికింద్రాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికిగురై 80 శాతం కాలినగాయాలతో ఆస్పత్రిపాలైన సంధ్యారాణి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మృతి చెందింది.

సికింద్రాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికిగురై 80 శాతం కాలినగాయాలతో ఆస్పత్రిపాలైన సంధ్యారాణి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మృతి చెందింది. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే లాలాపేట్‌లో అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా గురువారం సాయంత్రం ఆమెపై కార్తీక్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం చనిపోయింది.
 
ఈ కేసులో సంధ్యారాణిపై పెట్రోల్ పోసిన కార్తీక్‌ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. ఆ తర్వాత తాను అలా ప్రవర్తించడానికి గల కారణాలను పోలీసులకు పూసగుచ్చినట్టు వివహించాడు. ఇందిరానగర్‌ లాలాపేట్‌కు చెందిన వంగా కార్తీక్‌ (28) అనే యువకుడు జులాయిగా తిరుగుతూ లక్కి ట్రేడర్స్‌ అనే అల్యూమినియం సరఫరా సంస్థలో పని చేస్తున్నాడు. ఈ కంపెనీలోనే ఆమెకు ఆ ఉద్యోగం ఇప్పించాడు. లాలాపేట్‌కు చెందిన సావిత్రి, దాస్‌ దంపతుల కుమార్తె సంధ్యారాణి డిగ్రీ వరకూ చదువుకుని ఖాళీగా ఉండటంతో ఆమెకు అదే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగమిప్పించాడు. 
 
ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే కార్తీక్‌ జులాయిగా తిరుగుతూ, పనికి సరిగా రాకపోవడంతో యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతడు.. 'నన్ను ఎలా తొలగిస్తారు. నిన్ను ఏ విధంగా విధుల్లో ఉంచుకుంటారు' అంటూ ఆమెను వేధించసాగాడు. అతడి వేధింపులు భరించలేక సంధ్యారాణి అతడితో పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆమెపై పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ కిరాతక చర్యను కార్తీక్ సమర్ధించుకున్నాడు. సంధ్యారాణికి లక్కీ ట్రేడర్స్‌లో తాను ఉద్యోగం ఇప్పించానని... ఆమెను ప్రేమించానని, పెండ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించిందని చెప్పాడు. ఆమె తన సహోద్యోగితో సన్నిహితంగా ఉండటంతో బాధతో కుమిలిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మీడియాకు వివరించాడు.