Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమరావతిలో ఘరానా మోసం.. సెంటి భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (14:27 IST)

Widgets Magazine
Amaravati

అమరావతిలో తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. సెంటు భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు కేటాయించుకోవడమేకాదు... వాటిని ఏకంగా అమ్ముకున్నట్టు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ నయా కుంభకోణం వివరాలను పరిశీలిస్తే, 
 
అమరావతి తుళ్లూరుకు సమీపంలో గౌస్ ఖాన్ (టీడీపీ నేతగా చెపుతున్నారు) అనే వ్యక్తి సీఆర్డియే అధికారులు కుమ్మక్కై రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ కోసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ, ఈయన భూమి ఇచ్చినట్టు తప్పుడు రికార్డులను సృష్టించారు. అతనికి దాదాపు రూ.3.50 కోట్ల మేరకు లబ్ది కలిగేలా రికార్డులను మార్చారు. అధికారుల మాయాజాలంతో రాజధానికి భూమి ఇవ్వకుండానే గౌస్ ఖాన్ ఎన్నో ప్రయోజనాలను పొందినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. 
 
భూ సమీకరణలో భాగంగా ఆయన భూమి ఇచ్చినట్టు రికార్డులు మార్చిన ఘటన వెలుగులోకి రావడంతో, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టపై మచ్చ తెచ్చే ఇటువంటి ఘటనలపై తాను కఠినంగా ఉంటానని హెచ్చరించారు. ఈ విషయమై తనకు నివేదిక సమర్పించాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఆర్డీయే కమిషనర్... లోతుగా విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ, రాజధాని ప్రాంతంలో భూకుంభకోణం వ్యవహారాన్ని 4 రోజుల క్రితం గుర్తించామని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై విచారణ అధికారిని నియమించామని, రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించామని తెలిపారు. ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకంగా జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే, 59 వేల ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Amaravathi Ghouse Khan Crda Officials Capital Land Cheating

Loading comments ...

తెలుగు వార్తలు

news

'తలకు పిలక... చేతిలో చిడతలు... ఓం నమో నారా' అంటూ ఎంపీ నిరసన

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ సహజంగానే ఓ నటుడు. అలాంటి ఆయనకు ...

news

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు ...

news

తొందరెందుకు... ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నాం కదా : నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ ...

news

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : సుప్రీం న్యాయమూర్తుల అరెస్టు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు ...

Widgets Magazine