Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైద్యుల వద్దకు అందమైన అమ్మాయిలు: లక్షలు గుంజుకుంటున్న ముఠా

గురువారం, 7 డిశెంబరు 2017 (13:19 IST)

Widgets Magazine
first love

అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్రలో విజయవాడ, గుంటూరు జిల్లాలో యువ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి అమ్మాయిలను దించి.. భారీ మొత్తాన్ని గుంజేసుకునే ముఠా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ వైద్యులే లక్ష్యంగా మోసగత్తెలైన అందమైన అమ్మాయిలను వారి వద్దకు వైద్యం కోసం పంపుతారు. ఆ అమ్మాయిలు మాయమాటలు చెప్పి వారిని లోబరుచుకుంటారు. వైద్యుల వద్ద తన భర్త సంసారానికి పనికిరాడని చెప్తూ.. వారికి దగ్గరవుతారు. ఆపై ఇంటికి పిలిపించుకుని రాసలీలలు మొదలెడుతారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తారు. ఆ వీడియోలను వారికే పంపి బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు గుంజుతారు. ఇలా 11 మంది వైద్యులు మోసగత్తెల వలలో చిక్కుకున్నారని పోలీసులు వెల్లడించారు. 
 
30-40 ఏళ్ల వయస్సు మధ్యనున్న వైద్యుల ఆస్పత్రులను ఎంచుకుని ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం లక్షలు గుంజుకుంది. అయితే ఇటీవల గుంటూరుకు చెందిన ఓ యువ డయాబెటాలజిస్ట్ నుంచి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేయడంపై ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఒంగోలు, విజయవాడలో ఈ మోసగత్తెల చేతిలో వైద్యులు మోసపోయారని.. ఇంచుమించు రూ.50 లక్షలకు పైగా సమర్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేస్‌లోకి "పందెం కోడి"... విశాల్ నామినేషన్ పునఃసమీక్షకు ఈసీ ఆదేశం?

ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసి తన సత్తాచాటాలని భావించిన సినీహీరో విశాల్ దాఖలు చేసిన ...

news

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీసిన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో ...

news

పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు.. వారసత్వ సినిమాల సంగతేంటి?

ప్రముఖ సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. ...

news

స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపిస్తా : పందెం కోడి సవాల్

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజక వర్గానికి గాను ఉప ఎన్నిక ...

Widgets Magazine