Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢిల్లీ గాలిలో విషవాయువులు.. జాగింగ్ చేస్తే అంతేనట... వైద్యుల హెచ్చరిక

శుక్రవారం, 3 నవంబరు 2017 (11:37 IST)

Widgets Magazine
delhi air

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఇక్కడ పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతుందని ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హెచ్చరిస్తోంది. లోధా రోడ్డులో గురువారం 121 పాయింట్లు ఉండగా శుక్రవారం ఉదయానికి అది 280 పెరిగింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడం, వాహనాలతో పొగతో పరిస్థితి విషమంగా ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచించింది.
 
దీనిపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు మార్నింగ్ వాక్, జాగింగ్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. దేశంలోనే అత్యంత కాలుష్య కారకనగరమైన ఢిల్లీలో ఉదయం వేళల్లోనే దుమ్ము ధూళి కణాల శాతం 2.5గా నమోదవుతోందని చెపుతున్నారు. 
 
దీంతో వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల వచ్చే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు, అనారోగ్యం బారినపడుతున్నారని, అందుకే ఉదయం పూట గాలి తాజాగా ఉంటుందని భావించి బయట వాకింగ్, జాగింగ్ చేయవద్దని సూచిస్తున్నారు. ఊపిరితిత్తులకు ముప్పుగా మారే కాలుష్య కారకాలు ఢిల్లీలోని గాలిలో ఉన్నాయని వారు తెలిపారు. 
 
మార్నింగ్ వాక్, జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనిసామర్థ్యం తగ్గిపోవడం తథ్యమని వారు హెచ్చరించారు. తమ వద్దకు శ్వాస సంబంధ సమస్యలతో వస్తున్న చాలా మంది బాధితులు మార్నింగ్ వాక్ లేదా జాగింగ్ అలవాటు ఉన్నవారేనని వారు తెలిపారు. అందుకే ఉదయంపూట వాకింగ్, జాగింగ్ కు బయటకు రావద్దని వారు సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతిలో ఖుష్బూ క్యాట్ వాక్

తిరుపతిలో నటి ఖుష్బూ సందడి చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీలో క్యాట్ వాక్ ...

news

హైదరాబాద్ : ఆడియో టేపుల్లో నారాయణ కాలేజీ అరాచకాలు

ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్ ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాతో ...

news

నిర్భయ సోదరుడు పైలట్ అయ్యాడు.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు: జ్యోతిసింగ్ తల్లి

దేశ వ్యాప్తంగా 2012లో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన గుర్తుందా..? నిర్భయ కామాంధులకై ...

news

హైదరాబాద్ నారాయణ కాలేజీ ధ్వంసం (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం ...

Widgets Magazine