గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:09 IST)

రోబోటిక్స్‌తో మానవ ఉనికికే ప్రమాదం: హాకింగ్ స్టీఫెన్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్‌తో ఉద్యోగాలు ఊడటమే కాదు మానవ ఉనికికే ప్రమాదమన్నారు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్‌తో ఉద్యోగాలు ఊడటమే కాదు మానవ ఉనికికే ప్రమాదమన్నారు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. గ్రహాంతరవాసులతో ప్రమాదం పొంచి ఉందని గతంలో హెచ్చరించిన హాకింగ్‌ తాజాగా రోబోలు మానవులను పూర్తిగా ఆక్రమించేస్తాయని… కృత్రిమ మేథతో పెనుముప్పు ఎదురవనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మానవజాతిని మొత్తంగా కబళిస్తుందనే భయం తనకుందన్నారు. కంప్యూటర్‌ వైరస్‌లను కొందరు క్రియేట్‌ చేస్తే వాటికి ధీటుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సృష్టిస్తుందని, ఇది విధ్వంసానికి దారితీస్తుందన్నారు. ఇది మనుషుల పాత్రను పరిమితం చేసే కొత్త విధానమన్నారు. మానవ మెదడు, కంప్యూటర్‌ సాధించే విషయాల్లో వైరుధ్యం ఉందని తాననుకోవడం లేదన్నారు.
 
ప్రపంచ జనాభా ఆందోళనకరంగా పెరిగిపోతోందని.. మనం స్వయం విధ్వంసం దిశగా వెళుతున్నామని హెచ్చరించారు. మానవ జాతిని పరిరక్షించుకునేందుకు మనం ఇతర గ్రహాలను అన్వేషించాల్సి ఉందన్నారు. రాబోయే వందేళ్లలో మానవులు భూమిని వదిలి వేరే గ్రహాలకు వెళ్లే రోజులు వస్తాయని హాకింగ్ తెలిపారు.