శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (19:28 IST)

వరుసకి సోదరే.. అయినా లైంగిక సుఖం కోసం వెంటపడ్డాడు!

వరుసకు సోదరి అయినప్పటికీ ఒక వివాహిత మహిళను కోరిక తీర్చమని ఓ కామాంధుడు వెంటబడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. లావేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు వరుసకు సోదరి అయిన వివాహితను కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు.అతని వేధింపులను భరించలేక ఆమె పెద్దలకు చెప్పింది. అతనిని రచ్చబండకు పిలిపించి నిలదీశారు. 
 
ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఫోనులో అసభ్యంగా మాట్లాడుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసేది. అయినా అతను వేధింపులు మానలేదు. అతని మాటలను రికార్డు చేసి పెట్టింది. ఈ క్రమంలో గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల వద్ద బోరు వద్దకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ వివాహిత స్నానానికి వెళ్లింది. 
 
అప్పటికే అక్కడ కాపుకాసిన రమణ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలానికి వెళ్లిన బాబాయి వరుస అయ్యే వ్యక్తి రమణను పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకొచ్చి నిలదీశాడు. ఇదిలా ఉండగా, తనను వేధించిన వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉందని, ఆమె పోలీసులను ఆశ్రయించింది. రమణ వైపు వారు కూడా ఫిర్యాదు చేశారు.