శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (18:11 IST)

ఏపీ - తెలంగాణ గొడవ .. సూచనతో సరిపుచ్చుకున్న గవర్నర్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం చెలరేగగా, ఈ సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 
 
దీపావళి పండుగ సందర్భంగా ఆయన గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. 
 
శ్రీశైలంలో నీటిని జల విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యధావిధిగా నీటిని విడుదల చేస్తోంది. 
 
ఈ సమస్యను పరిష్కరించాల్సిన గవర్నర్ ఓ సలహా ఇచ్చి మిన్నకుండి పోయారు. ఇరు రాష్ట్రాల సీఎంలను ఒకచోట కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేయడానికి బదులు సలహా సరిపుచ్చుకున్నారు.