Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాన్పు ఖర్చులకు డబ్బులివ్వలేదనీ భార్యను చంపేశాడు

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:36 IST)

Widgets Magazine
murder

కాన్పు ఖర్చులకు అత్తింటివారు డబ్బులు ఇవ్వలేదనీ ఓ కసాయి కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన వల్లాల ఏడుకొండలుకు అదే గ్రామానికి అనూష (19)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలల క్రితం ఆమె కొడుకును ప్రసవించింది.
 
తొలి కాన్పు అయ్యే ఖర్చులను అత్తింటివారే భరించాలని ఏడుకొండలు తెగేసి చెప్పాడు. దీనికి అత్తింటివారు సమ్మతించారు. అయితే, డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఏడుకొండలు కట్టుకున్న భార్యను హతమార్చాడు. ఆమె ఆరు నెలల శిశువుకు తల్లి అని కూడా చూడలేదు. పైగా, ఈ హత్యకు అతని తల్లిదండ్రులు కూడా సహకరించడం గమనార్హం. అత్తమామలైన బ్రహ్మయ్య, ధనమ్మలు అనూషను మంచంపై పడుకోబెట్టి కాళ్లు చేతులు నొక్కిపెడితే, ఏడుకొండలు గొంతునులిమి కడతేర్చాడు. ఈ దారుణం బుధవారం తెల్లవారుజామున జరిగింది. 
 
అరుపులు వినిపిస్తుంటే పక్కనున్న వారు వచ్చి చూసి అనూషను స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. ఆ తర్వాత అనూష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అదనపు కట్నం, ప్రసవ నగదు ఇవ్వలేదనే భర్త ఏడుకొండులు తన తల్లిదండ్రులతో కలిసి చంపాడని మృతురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జేపీ కోసం జనసేనాని : కదనరంగంలోకి దూకిన పవన్ కళ్యాణ్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక సంయుక్త కార్యారణ ...

news

కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ లీడర్స్ గజ మోసగాళ్లు : టీడీపీ ఎంపీలు

భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం ...

news

సేఫ్ శృంగారం అయితే ఓకే... యువ స్కాలర్‌కు పీహెచ్‌డీ విద్యార్థిని ఆఫర్

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ...

news

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే ...

Widgets Magazine