Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:44 IST)

Widgets Magazine
murder

భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను గొడ్డలితో నరికేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని రెవాడీ పరిధిలోని కుమ్రోడా గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుమ్రోడా నివాసి జయప్రకాష్(52) బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. జనవరిలో సెలవుమీద గ్రామానికివచ్చి ఉంటున్నాడు. అతని ఇద్దరు పిల్లలు, తల్లి బయటకు వెళ్లిన సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
అపుడు క్షణికావేశానికు గురైన జవాను... ఆగ్రహంతో ఊగిపోతూ జయప్రకాష్ గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ ఘటనను చూసిన జవాను తల్లి చుట్టుపక్కలవారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ జంట మృత దేహాలను పోస్టుమార్టంనకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు ...

news

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం ...

news

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు ...

news

బీజేపీ హయాంలో పెరిగిన మతకలహాలు... యూపీలోనే అధికం

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత దేశ ...

Widgets Magazine