ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:29 IST)

ఆర్థిక ఇబ్బందులే కారణం.. భార్యను గోడకేసి కొట్టాడు.. బిడ్డల్ని గొంతు నులిమి?

హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న యువకుడు తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మరవక ముందే.. సోమవారం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను పొట్టనపెట

హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న యువకుడు తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మరవక ముందే.. సోమవారం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను పొట్టనపెట్టుకున్నాడు. ఇందుకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని.. అందుకే భార్యాపిల్లలను చంపేసి పోలీసుల ముందు లొంగిపోయాడట. 
 
వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన  హరీందర్‌గౌడ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, ఆరేళ్ల కుమారుడు అభిజిత్, నాలుగేళ్ల కుమార్తె సహస్రలను గొంతు నులిమి చంపేశాడు. ఇక భార్యను గోడకేసి బలంగా కొట్టి చంపేశాడు. అమీర్‌పేట పోలీసులకు లొంగిపోయాడు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో హరీందర్ గౌడ్ నడుపుతున్న క్లినిక్ సరిగ్గా నడవకపోవడంతో ఏర్పడిన తగాదాలో ఆవేశానికి గురైన హరీందర్ భార్యాపిల్లలను హతమార్చాడని సమాచారం అందుతున్నట్లు పోలీసులు తెలిపారు.