శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (12:53 IST)

ఎన్నారై సంబంధాలొద్దండి బాబూ.. వేధిస్తున్నారట.. 8 గంటలకు ఓ ఫోన్‌కాల్?

ఎన్నారై సంబంధాల కోసం వెతుకుతున్నారా? విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు అమ్మానిచ్చి పెళ్లి చేస్తున్నారా? ఈ గణాంకాలు చూస్తే కాస్త జడుసుకుంటారు. విదేశాల్లో పనిచేసే వ్యక్తులతో సంబంధాలు కుదుర్చుకుంటే గొప్పగా వ

ఎన్నారై సంబంధాల కోసం వెతుకుతున్నారా? విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు అమ్మానిచ్చి పెళ్లి చేస్తున్నారా? ఈ గణాంకాలు చూస్తే కాస్త జడుసుకుంటారు. విదేశాల్లో పనిచేసే వ్యక్తులతో సంబంధాలు కుదుర్చుకుంటే గొప్పగా వుంటుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఎన్నారై భార్యలకు వేధింపులు తప్పట్లేదని తాజా గణాంకాల్లో వెల్లడైంది. 
 
ప్రతీ 8 గంటలకు ఓ ఎన్నారై భార్య తనకు భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని.. స్వదేశం తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని కోరుతూ కాల్ చేస్తున్నట్లు విదేశాంగ శాఖాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 వరకు 1,064 రోజుల్లో విదేశాంగ శాఖకు ఇలా సాయం కోరుతూ 3,328 కాల్స్ వచ్చాయట. అంటే రోజుకు మూడు కాల్స్ చొప్పున సగటున 8 గంటలకు ఒక కాల్ వచ్చినట్లు గణాంకాలు తేల్చాయి. 
 
ఇలా ఎన్నారై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పంజాబ్ రాష్ట్రాల వారే అధికంగా వున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు అధిక శాతం ఎన్నారై భర్తల చేతిలో వేధింపులకు గురవుతున్నారని వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ అధికారి ఆర్తిరావ్ తెలిపారు. వరకట్నం కోసం ఎన్నారైలు భార్యలను వేధింపులకు గురిచేస్తున్నారని.. ఎన్నారై అబ్బాయిలు భారత్‌కు వెళ్లి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా వారితో కలిసి జీవించే ఉద్దేశం వారికి లేదన్నారు. వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆర్తిరావ్ చెప్పారు.