Widgets Magazine

నా భార్య హర్షితకు మగ స్నేహితులే ఎక్కువ: హీరో సామ్రాట్

భార్య ఇంట్లో దొంగతనం కేసులో బెయిల్‌పై గురువారం విడుదలైన హీరో సామ్రాట్ భార్య హర్షిత పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్య హర్షితకు ఆడవాళ్ల కంటే మగ స్నేహితులే ఎక్కువగా ఉన్నారన్నారు. తాను సినిమా ఇండస్ట్రీలో

Samrat_wife
selvi| Last Updated: గురువారం, 1 ఫిబ్రవరి 2018 (18:50 IST)
భార్య ఇంట్లో దొంగతనం కేసులో బెయిల్‌పై గురువారం విడుదలైన హీరో సామ్రాట్ భార్య హర్షిత పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్య హర్షితకు ఆడవాళ్ల కంటే మగ స్నేహితులే ఎక్కువగా ఉన్నారన్నారు. తాను సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఆమెకు ఇష్టం లేనందునే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే గొడవలు జరిగాయని సామ్రాట్ వెల్లడించారు.
హర్షిత తన సోదరి వాళ్లింట్లో వుంటోందని.. ఆ రోజు తన బట్టలు తెచ్చుకునేందు వెళ్తే.. ఇళ్లు తాళం వేసి వుందన్నారు. అందుకే తాళాన్ని పగులకొట్టానని.. దొంగతనం చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే, వరకట్నం వేధింపుల కేసులో బ్లాక్ మెయిల్ చేసి తన వద్ద రూ.ఐదు కోట్లు రాబట్టాలని హర్షిత, ఆమె తల్లిదండ్రులు ప్లాన్ వేశారని ఆరోపించారు.


దీనిపై మరింత చదవండి :