ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (09:58 IST)

అమెరికన్ నటుడు ఆత్మహత్య: లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో..

లైంగిక వేధింపులు.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ నటుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ యువ నటుడు మార్క్ సాలింగ్ పలు టీవీ సిరీస్‌లలో నటించాడు. నటుడిగా మంచ

లైంగిక వేధింపులు.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ నటుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ యువ నటుడు మార్క్ సాలింగ్ పలు టీవీ సిరీస్‌లలో నటించాడు. నటుడిగా మంచి పేరు వుంది. అయితే 2015లో అతనిపై లైంగిక వేధింపులు, చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు 2016లో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 
 
ఈ క్రమంలో సాలింగ్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో దాదాపు 50వేల చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఫోటోలు, వీడియోలంటాన్ని గుర్తించారు. ఆపై సాలింగ్‌ను కోర్టు దోషిగా తేల్చారు. అయితే ఇంకా శిక్ష ఖరారు కాలేదు. మార్చి 7వ తేదీన శిక్ష ఖరారు చేయాలని కోర్టు నిర్ణయించింది. ఇంతలోనే తన నివాసంలో సాలింగ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.