మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (11:39 IST)

నా భర్త మగాడు కాదు.. ఓ గే : నటుడు సామ్రాట్ రెడ్డి భార్య

తన భర్త మగాడు కాదనీ, ఓ గే అంటూ టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి భార్య హర్షితా రెడ్డి ఆరోపించారు. పైగా, తన ఇంట్లో బంగారంతో పాటు నగదును చోరీ చేశాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భర్త మగాడు కాదనీ, ఓ గే అంటూ టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి భార్య హర్షితా రెడ్డి ఆరోపించారు. పైగా, తన ఇంట్లో బంగారంతో పాటు నగదును చోరీ చేశాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిపై ఆయన భార్య హర్షిత రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్రాట్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై హర్షితా రెడ్డి మాట్లాడుతూ, తన భర్త మగాడు కాదనీ, ఆయనకు అనేక మంది మగ స్నేహితులు ఉన్నారని, ఈ విషయం తన కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, కారు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి లేడీ డ్రైవర్‌గా చూస్తుండేవాడని ఆరోపించింది. 
 
తామిద్దరం బయటకు వెళ్లినపుడు చాలా అన్యోన్యంగా ఉన్నట్టుగా నటించేవాడనీ, ఆ తర్వాత ఇంటికి వచ్చాక తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ వచ్చాడని పేర్కొంది. ముఖ్యంగా, తన తండ్రి పేరిట ఉన్న షేర్లను బదిలీ చేసేందుకు తాను అంగీకరించక పోవడంతో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొంది. 
 
తన పక్కనే కూర్చుని రాత్రంతా చాటింగ్‌లు చేస్తుండేవాడని, అడిగితే కొట్టేవాడని ఆరోపించింది. ఎప్పుడూ హుక్కా సెంటర్లలో తిరుగుతుంటాడని, తనకు ఆ వాసన పడదని చెప్పినా వినడని, గంటలు గంటలు కూర్చుని, హుక్కా, డ్రగ్స్ తీసుకునేవాడని మీడియా ముందు వాపోయింది.