Widgets Magazine

భర్తను చితకబాది.. కళ్లముందే భార్యపై అత్యాచారం.. ఎక్కడ?

మంగళవారం, 23 జనవరి 2018 (13:26 IST)

rape victim

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను చితకబాది ఆయన కళ్లెదుటే భార్యను నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ ఘటన హర్యానాలో ఆదివారం రాత్రి జరుగగా, సోమవారం వెలుగు చూసింది. ఈ వివరాలను పలిశీలిస్తే, 
 
గుర్గావ్‌లోని సెక్టార్ 56కు చెందిన దంపతులు తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌ను ఆదివారం రాత్రి వెళ్లారు. భోజనం చేశాక రాత్రి 10 గంటల సమయంలో తమ ఇంటికి దంపతులిద్దరూ తిరిగి వస్తుండగా.. టాయిలెట్ కోసమని సెక్టార్ 56లోని బిజినెస్ పార్క్ వద్ద కారును ఆపారు. 
 
భర్త టాయిలెట్‌కు వెళ్లి వచ్చేలోగా.. వీరి కారును నలుగురు దుండుగులు చుట్టుముట్టారు. ఆ తర్వా కారులోని మహిళను బలవంతంగా దుండగులు బయటకు లాగారు. దాన్ని అడ్డుకోబోయిన భర్తను చితకబాది.. అతడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామని దుండగులు దంపతులను బెదిరించారు. మొత్తానికి బాధితురాలి భర్త.. నిందితుల కారు నెంబర్‌ను నోట్ చేసుకోవడంతో వారిని పట్టుకునేందుకు మార్గం సులువైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్‌తో మాట్లాడితే తప్పేంటి? పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయితే తప్పేముందని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ...

news

ట్రిపుల్ తలాక్ ముస్లిం పురుషులను శిక్షించేందుకే: ఓవైసీ

ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15లక్షలు జమ ...

news

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... ...

news

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధం: దోషికి 60ఏళ్ల జైలు శిక్ష

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. పెన్సల్వేనియా హైస్కూల్లో ...

Widgets Magazine