Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పద్మావత్' విడుదలను ఆపాలంటూ థియేటర్లపై దాడులు

సోమవారం, 22 జనవరి 2018 (13:23 IST)

Widgets Magazine
padmavati movie still

బాలీవుడ్ దర్శకదిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావత్. ఈ చిత్రం ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతో పాటు... తమిళ్, తెలుగు భాషాల్లో కూడా రిలీజ్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ దాడులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ముందస్తుగానే ఆ సినిమాపై నిషేధం విధించాయి. పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ.. హర్యానా కురుక్షేత్రలోని ఓ మాల్‌పై 20 నుంచి 22 మంది యువకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. 
 
దౌర్జన్యంగా మాల్‌లోకి ప్రవేశించిన దుండగులు.. గాల్లోకి కాల్పులు జరిపారు. అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని కత్తులతో బెదిరించారు. మాల్‌పై దాడి చేసిన వారిలో కొందరిని గుర్తించామని హర్యానా పోలీసులు తెలిపారు. ఈ దాడిపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. 
 
మరోవైపు, మాల్‌పై దాడి ఘటనను హర్యానా సీఎం మనోహర్ లాల్‌ఖట్టర్ ఖండించారు. కొందరు వ్యక్తులు సినిమా చూడొద్దన్న మాత్రాన.. సినిమాను నిలిపివేయడం సరికాదన్నారు. నిజానికి పద్మావత్ చిత్ర ప్రదర్శనపై హర్యానా ప్రభుత్వం నిషేధం విధించగా, సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ ఈ రెండు రాష్ట్రాలు పిటిషన్‌లో కోర్టును కోరాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కాగా, ఈ చిత్ర ప్రదర్శనకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పబ్‌లో పూరీతో కలిసి డాన్స్ చేస్తున్న చార్మీ (వీడియో)

పంజాబీ ముద్దుగుమ్మ, టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా ...

news

నవీన్‌ను పెళ్లాడిన భావన: శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక చోప్రా

దక్షిణాది హీరోయిన్, మలయాళ నటి భావన తన మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడింది. దాదాపు ఐదేళ్ల ...

news

''నా నువ్వే'' కోసం తమన్నా కసరత్తులు.. గాయాలు కూడా అయ్యాయట..

''నా నువ్వే'' సినిమా కోసం తమన్నా కసరత్తులు చేస్తోంది. కల్యాణ్‌రామ్ హీరోగా జయేంద్ర ...

news

'బాహుబలి' రికార్డులు బద్ధలు కొట్టిన రజనీకాంత్ '2.0'

సూపర్ స్టార్ రజనీకాంత్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ...

Widgets Magazine