Widgets Magazine

'పద్మావత్' చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లను తగులబెడతాం : రాజ్‌పుత్

'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడమే కాకుండా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని తొలగ

padmavati movie still
pnr| Last Updated: గురువారం, 18 జనవరి 2018 (17:31 IST)
'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడమే కాకుండా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని తొలగించింది. దీంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఈ చిత్ర విడుదలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గీయులు మాత్రం ఏమాత్రం తలొగ్గడం లేదు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ వినతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని తాజాగా హెచ్చరించారు. పైగా, ఈ చిత్రాన్ని నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.

రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.


దీనిపై మరింత చదవండి :