Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉరితీసినా 'పద్మావత్' చిత్రాన్ని అడ్డుకుంటాం : బీజేపీ నేత

శుక్రవారం, 19 జనవరి 2018 (09:35 IST)

Widgets Magazine
suraj amu

తనను ఉరితీసినా 'పద్మావత్' చిత్ర ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ అము ప్రకటించారు. తనను ఉరి తీస్తున్నా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉంటానని సూరజ్ పాల్ స్పష్టం చేశారు. ‘పద్మావత్’ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ లేదా నటి దీపిక తల నరికి తీసుకువస్తే తాను పదికోట్ల రూపాయలు ఇస్తానని గతంలో సూరజ్ పాల్ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. మొత్తంమీద బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ తాజా వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపాయి.
 
మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు తొలగించింది. దీంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ చిత్ర విడుదలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గీయులు మాత్రం ఏమాత్రం తలొగ్గడం లేదు. 
 
తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ వినతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని తాజాగా హెచ్చరించారు. పైగా, ఈ చిత్రాన్ని నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
రాణి 'పద్మావతి' జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి..

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ...

news

బాబు సినిమా కట్ బాబాయ్ సినిమాకు ఓకే... ఎవరు?

ఒకరితో సినిమాకు ప్లాన్ చేస్తుంటే మరొక హీరో నుంచి ఫోన్ చేస్తే వెంటనే పరుగెత్తుకుని వెళ్ళడం ...

news

'పద్మావత్' చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లను తగులబెడతాం : రాజ్‌పుత్

'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు ...

news

'దిల్ రాజు'కే ఝలక్ ఇచ్చిన సాయిపల్లవి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో 'దిల్' రాజు ఒకరు. గత యేడాది ఏ నిర్మాత కూడా ...

Widgets Magazine