Widgets Magazine

క్రైమ్ రేట్‌లో టాప్-3-హర్యానాలో ఘోరం: 24 గంటల్లో నాలుగు అత్యాచారాలు

దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు రావట్లేదని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్యానాలో గ

rape victim
selvi| Last Updated: మంగళవారం, 16 జనవరి 2018 (11:06 IST)
దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు రావట్లేదని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్యానాలో గత 24 గంటల్లో జరిగిన నాలుగు అత్యాచారాలు కలకలం రేపాయి. దేశంలోనే క్రైమ్ రేటులో హర్యానా టాప్-3లో వుంది.

బీజేపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. అయితే ఒక్క రోజులోనే నాలుగు అత్యాచారాలు చోటుచేసుకోవడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల రక్షణకు హర్యానా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

50 ఏళ్ల వ్యక్తి తన సమీప బంధువైన 10 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఆమె ప్రైవేట్ అవయవాలపై కర్రతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అలాగే ఇద్దరు దళిత బాలికలను అత్యాచారం చేసి హత్య చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.

మరో ఘటనలో యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో సీఎం ఖట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.


దీనిపై మరింత చదవండి :