శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (17:24 IST)

"పద్మావత్‌"కు మళ్లీ బ్రేకులు... గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ బాట‌లో హ‌ర్యానా...

బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు మళ్లీ చిక్కులు తప్పేలాలేవు. ఈ చిత్రం విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం మోకాలొడ్డుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రం విడుదల

బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు మళ్లీ చిక్కులు తప్పేలాలేవు. ఈ చిత్రం విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం మోకాలొడ్డుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రం విడుదల మరోమారు చర్చనీయాంశంగా మారింది. 
 
బాలీవుడ్ దర్శకదిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు ప్రధాన పాత్రలుగా నటించారు. 
 
ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కావాల్సి వుంది. అయితే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. రాజ్‌పుత్ కర్ణిసేన ప్రతినిధులు హెచ్చరికల నేపథ్యంలో చిత్రాన్ని విడుదల నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టైటిల్‌ను 'ప‌ద్మావ‌త్'గా మార్చి చిత్రం విడుద‌ల‌కు సీబీఎఫ్‌సీ మార్గం సుగ‌మం చేసింది. 
 
అయిన‌ప్ప‌టికీ, వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మాత్రం ఆ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సుముఖంగా లేవు. ఈ సినిమా విడుద‌ల‌పై రాజ్‌పుత్ వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త ఉన్న దృష్ట్యా ఇప్ప‌టికే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు 'పద్మావ‌త్' చిత్రం విడుద‌ల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాట‌లో హ‌ర్యానా రాష్ట్రం కూడా ప‌ద్మావ‌త్ విడుద‌ల‌ను నిషేధించింది.