Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజౌరీ సెక్టార్‌లో పాక్ సైనికుల బుల్లెట్ల వర్షం... నలుగురు సైనికుల మృతి

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:03 IST)

Widgets Magazine
pakistan soldiers

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో ఆర్మీ సెంకెండ్ ఆఫీసర్ కెప్టెన్ కపిల్ కుందు ఉన్నారు. నలుగురు స్థానికులు గాయపడ్డారు. గత 40 రోజులుగా పాక్ జరుపుతున్న కాల్పుల్లో ఆర్మీ అధికారి చనిపోవడం ఇది రెండోసారి.
 
పాక్ కాల్పులతో విరుచుకుపడుతుండటంతో రాజౌరీ సెక్టార్‌లో సరిహద్దుకు సమీపంలో ఉన్న 84 పాఠశాలలను మూసివేయించారు. మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అలాగే సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో మిగతా వారిని రైఫిల్ మ్యాన్‌లు రామ్ అవతార్, శుభం సింగ్, హవల్దార్ రోషన్ లాల్, జవాను నియాక్ ఇక్బాల్ అహ్మద్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రాజౌరీ కెప్టెన్ పాకిస్తాన్ Kill Rajouri Sector Indian Soldiers Pakistan Firing

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీరు ఆవేశపడొద్దు.. బీజేపీపై వ్యతిరేకత లేదు : ఎంపీల భేటీలో చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం ...

news

70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 ...

news

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి ...

news

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా

తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర ...

Widgets Magazine