శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (15:13 IST)

ఉ.కొరియాకు పెనుముప్పు పొంచివుంది.. ఆ దేశాలను వదలం: అమెరికా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య త్వరలో యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ మీడియా కోడైకూస్తున్న వేళ.. అగ్ర రాజ్యమైన అమెరికా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆసియా దేశాల్లో ప్రాభవం కోసం పాకులాడి అణ్వస్త్రా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య త్వరలో యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ మీడియా కోడైకూస్తున్న వేళ.. అగ్ర రాజ్యమైన అమెరికా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆసియా దేశాల్లో ప్రాభవం కోసం పాకులాడి అణ్వస్త్రాలను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అలా ఉపయోగిస్తే.. ఆ అణ్వాస్త్రాలను అణచివేసేందుకు తమవద్ద కూడా శక్తివంతమైన ఆయుధాలున్నాయని.. ఆ విషయాన్ని చైనా గుర్తించుకోవాలని అమెరికా హెచ్చరించింది. 
 
అణ్వస్త్ర వాడకానికి సంబంధించి తయారు చేసిన 74 పేజీల నివేదికలో అమెరికా ఉత్తరకొరియాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన అణ్వస్త్ర విధానాలనే తాము అనుసరించనున్నట్లు ప్రకటించింది. అలానే రష్యాకు కూడా అమెరికా పనిలో పనిగా హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఉత్తర కొరియాకు పెను ముప్పు పొంచి వుందని.. ఇక ఉగ్రవాదులను ప్రోత్సహించే ఏ దేశాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ అణ్వస్త్ర ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు నడుం బిగించాలని అగ్రరాజ్యం కోరింది.