ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:32 IST)

టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు.