శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (21:11 IST)

మార్చి4న తూర్పుగోదావరిలో 18 చేనేత కులాల సమావేశం

చేనేత సమస్యలపై వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం మార్చి 04, 2017 మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సమావేశం జరుగుతోంది. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం

చేనేత సమస్యలపై వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం మార్చి 04, 2017 మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సమావేశం జరుగుతోంది. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం, రామకృష్ణ సమావేశ మందిరంలో జరుగుతుంది. చేనేత చరిత్రలో మైలురాయిగా నిలిచే సందర్భానికి పిఠాపురం వేదిక కాబోతుంది. అన్ని చేనేత కులాల ప్రతినిదులతో వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి  రాయలసీమ, ఆంధ్రా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో రానున్నారు.
 
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో అజెండాగా...  చేనేత రంగ సమగ్ర అభివృద్ధి, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యవర్గం ఏర్పాటు, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయాలు ఏర్పాటు, స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతోపాటుగా, సమావేశం ప్రతిపాదించిన ఇతర అంశాలపై చర్చ మరియు ప్రతిపాదిత తీర్మానాలు ఉంటాయని రాష్ట్ర కన్వీనర్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు శీరం శ్రీరామచంద్రమూర్తి, కోట వీరయ్య,  తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. 
 
వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అందర్ని కలుపుకొని అన్ని చేనేత కులాల సహకారంతో చేనేత కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్దికి కృషిచేయాలన్న మౌలిక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పద్మశాలీ సాథికార సంస్థ ప్రతినిదులనూ ఆహ్వానించడం జరిగింది. ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7వ స్థానంలో ఉండి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండంకెలు స్థాయి జిడిపి సాధించిన రాష్ట్రాలలో అగ్రగామిగా ఉందని మన ఆర్థిక సర్వే చెప్తుంది. 
 
ఒకవైపు దేశ, రాష్ట్ర అభివృద్ది జరుగుతున్నా ఆర్థిక ఫలాలు అందుకోవడంలో సగటు నేత కార్మికుడు, చేనేత వర్గం చాలా వెనుకబాటులో ఉంది. ఈ పరిస్థితి మారాలి. చేనేత కులాలు సంఘటితంతో హక్కులు సాధించుకోవాలన్న ఉద్దేశం నేతన్నలలో ఉంది. పిఠాపురం, మున్సిపల్ కళ్యాణ మండపం అతిథిలకు ఆత్మీయ స్వాగతం పలకడానికి శీరం ప్రసాదు ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత లక్ష్య సాధన కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, ముఖ్యంగా ఐక్య కార్యచరణ కోసం ఏర్పాటు చేసిన ఈ సభకు అంతా రావాలని కోరుతున్నారు.