శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2015 (10:44 IST)

7వ తేదీ నుంచి శాంపిల్ పుష్కరాలు: ఏపీ సర్కారు నిర్ణయం

గోదావరి పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో నమూనా పుష్కరాలను నిర్వహించాలని, పుష్కర సమయాల్లో ఎలాంటి చర్యలుంటాయో, వాటినన్నంటినీ ట్రయల్ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. వచ్చే నెలలో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో 7వ తేదీ శాంపిల్ పుష్కరాలు జరుగనున్నాయి. రోజూ గోదావరి నదికి హారతివ్వడం నుంచి, నదీ కరకట్టల వెంబడి బాణసంచా వేడుకల వరకూ ట్రయల్ వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 
 
25వ తేదీన తాను రాజమండ్రిలో పర్యటిస్తానని, ఆ సమయానికి నమూనా పుష్కరాలకు సంబంధించిన పనులు పూర్తి కావాలని బాబు ఆదేశించారు. కడియం నర్సరీ పూలతో అలంకరణ, అన్ని రకాల వంటకాలతో కూడిన ప్రదర్శనలు, భద్రత నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.