శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:35 IST)

రాజధాని భూముల... రిజిస్ట్రేషన్లు కొనసాగించండి

రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతం భూముల భేరసారాలు అధికంగా ఉండడంతో వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులో రిట్ దాఖలు చేశారు. 
 
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి ఆ ప్రాంతంలో భూముల ధరలను ఆకాశానికి పెంచేస్తున్నారని ధరలను బంగారు కంటే అధికం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తూ, ల్యాండ్ సీలింగ్ ను ప్రవేశపెట్టింది. దీనిపై స్పందించిన హైకోర్టు ల్యాండు సీలింగ్ ఎత్తేయాలని ఆ ప్రాంతంలో ఎవరైనా కొనుగోళ్ళు అమ్మకాలు జరుపుకోవచ్చునని అభిప్రాయపడింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలలో విధించిన ల్యాండు సీలింగ్ ఎత్తేయాలని ఆదేశించింది