శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 21 మే 2015 (19:17 IST)

ఏపీ రాజధాని భూసేకరణ... జీవో నంబర్ 166పై హైకోర్టు స్టే.. ప్రభుత్వానికి షాక్

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.166ని రెండువారాలపాటు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాజధాని విషయంలో భూసేకరణని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు గతంలో హై కోర్టుకు వెళ్లారు. అయితే రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తప్పితే, వారి నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం మాత్రం చేయవద్దని అప్పట్లో హైకోర్టు స్పష్టంచేసింది. 
 
భూసేకరణ విధానం కుదరకపోవడంతో కొత్తగా 166 జీవోతో భూసమీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ విధానంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హై కోర్టు మరోసారి ఈ జీవోని కూడా రెండువారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
రాజధాని నిర్మాణ సమయంలో హైకోర్టు స్టే విధించడం ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయపడ్డట్లే అయ్యింది. జూన్ 6న ప్రభుత్వం భూమి పూజ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కోర్టు నుంచి చుక్కెదురయ్యింది.