Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కళను నీచ కార్యక్రమాలకు వాడుకుంటారా..? శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించండి

శనివారం, 6 జనవరి 2018 (09:38 IST)

Widgets Magazine

కళను అడ్డం పెట్టుకుని నీచాతి నీచ కార్యక్రమాలకు పాల్పడిన ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై సాంస్కృతిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో గజల్ శ్రీనివాస్‌ ఉన్నాడు. ఇప్పటికే ''సేవ్ టెంపుల్'' ప్రచారకర్తగా శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు.
 
తాజాగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీనివాస్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని.. అతనిని కఠినంగా శిక్షించాలని ''ఆనందలహరి'' సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. అంతేగాకుండా శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన సాంస్కృతిక, కళా సంఘాలు కూడా తమ బాటనే అనుసరించాలని సూచించింది. 
 
గజల్ శ్రీనివాస్‌పై నమోదైన కేసును నీరుగార్చేందుకు కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించింది. కళను ఇటువంటి దుర్మార్గపు, నీచ కార్యక్రమాలకు వాడుకోవడం హేయమని ఆనందలహరి మండిపడింది. శ్రీనివాస్ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాలని.. అతనిని కఠినంగా శిక్షించాలని ఆనందలహరి డిమాండ్ చేసింది. 
 
రేడియో జాకీని వేధించిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలతో సహా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గజల్ శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంది. ఇంకా బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడి సుఖం కోసమే బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేశా : జ్యోతి

ప్రియుడు ద్వారా శారీరకసుఖం పొందేందుకే కట్టుకున్న భర్తకు బూస్ట్‌లో నిద్రమాత్రలు కలిపి ...

news

ఆట కోసం గర్ల్స్‌ను అలా కూర్చోబెట్టారు.. చూసేందుకు జనాల క్యూ (వీడియో)

ఓ ఆటను చూసేందుకు ఆ దేశ వాసులు క్యూ కడుతున్నారు. దీనికి కారణం.. ఆ ఆటను ఆడుతున్న అమ్మాయిలను ...

news

రజనీకాంత్‌కు సీఎం ఛాన్స్ లేదట... ఎందుకంటే?

తమిళనాడు రాష్ట్రంలో నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి రాజకీయ ...

news

200 మంది ఐటీ ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన వెరిజాన్, ఉద్యోగులు గగ్గోలు...

సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు ...

Widgets Magazine