శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:17 IST)

టెన్త్ క్లాస్ నుంచే లవ్... అమీన్‌పూర్ గుట్టలే వారిద్దరి హనీమూన్ స్పాట్...

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రియురాలిని ప్రియుడే హత్య చేసినట్టు తేలింది. ఈ మేరకు నిందితుడిని కూడా అరెస్టు చ

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రియురాలిని ప్రియుడే హత్య చేసినట్టు తేలింది. ఈ మేరకు నిందితుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో చాందినీ జైన్ హత్య కేసులోని మిస్టరీని కేవలం మూడు రోజుల్లో ఛేదించారు. 
 
ఈ కేసులో హతురాలు చాందినీ జైన్, ఆమె ప్రియుడు సాయి కిరణ్ (ఎస్.కె) నేపథ్యాన్ని పరిశీలిస్తే... మియాపూర్‌లో నివాసం ఉండే ఓ వ్యాపారి కుమారుడు సాయి కిరణ్, చాందినీ జైన్‌లు బాచుపల్లిలోని ఓ పాఠశాలలో కలిసి చదివారు. పదోతరగతి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించి చనువుగా మారింది. 
 
అదే పాఠశాలకు సంబంధించిన కాలేజీలో చాందినీ ఇంటర్‌లో చేరగా, ఎస్కే మరో కాలేజీలోచేరాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ, చనువు కొనసాగింది. తరుచూ అమీన్‌పూర్ గుట్టల్లో రహస్యంగా కలుసుకొని సన్నిహితంగా, ఏకాంతంగా గడిపేవాళ్లు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలంటూ సాయిపై చాందినీ ఒత్తిడి తీసుకొస్తుంటే.. అతను మాత్రం ఏదో ఒక కారణం చెపుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో చాందినీ అడ్డు తొలగించుకోవాలని ఎస్కే ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా, శనివారం అమీన్‌పూర్ గుట్టల్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
చాందినీ శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకురాగా, సత్యనారాయణ ఎన్‌క్లేవ్ వద్ద ఇద్దరూ ఆటో ఎక్కి అమీన్‌పూర్‌లో దిగి గుట్టపైకి వెళ్లారు. పెళ్లి కోసం పట్టుబడుతున్న చాందినీకి సాయి నచ్చచెప్పే ప్రయత్నంచేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా, సాయి చెంపపై కొట్టిన చాందినీ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. 
 
విచక్షణ కోల్పోయిన సాయి, బలంగా ఆమె గొంతునులిమి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాడు. అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో మృతిచెందిందని నిర్ధారించుకొని బండరాళ్ల మధ్య పడేసి, చాందినీ సెల్‌ఫోన్ తీసుకొని మరోమార్గంలో బయలుదేరాడు. పీజేఆర్ ఎన్‌క్లేవ్ రహదారి నుంచి వెళ్తూ మధ్యలో ఉన్న చెరువులో సెల్‌ఫోన్ పడేసి ఇంటికి చేరుకున్నాడు. 
 
ఈ క్రమంలో గుట్టలోని బండరాయిపై గుర్తు తెలియని శవం ఒకటి ఉందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... సోమవారం రాత్రి చాందిని మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారించగా, మృతురాలు చాందినీ జైన్‌గా గుర్తించారు. ఆ తర్వాత ఆమె స్నేహితుల వద్ద ఆరాతీశారు. 
 
అమీన్‌పూర్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించగా, చాందినీని ఓ యువకుడు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తర్వాత చాందిని ఎవరితో మాట్లాడింది, సోషల్ మీడియాలో చాట్ చేసిన విషయాలను సేకరించారు. ఆమెకు ఎస్‌కేతో ప్రేమ వ్యవహారం ఉన్నదని గుర్తించారు. ఎస్‌కే తండ్రికి సీసీ కెమెరా ఫుటేజీ చూపించగా, తన కొడుకేనని నిర్ధారించారు. అనంతరం ఎస్‌కేను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారించగా హత్యచేసింది తానేనని ఒప్పుకున్నాడు.