శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:45 IST)

పేరుకే ఐఆర్ఎస్ అధికారి.. భార్యను కట్నం కోసం వేధించాడు.. తీవ్రంగా కొట్టాడు..

పేరుకు ఐఆర్ఎస్ అధికారి. అయితే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. కానీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్‌ చెందిన 27 ఏళ్ల శ్రావణికి- కోటపాటి వంశీకృష్ణతో రెండేళ్ల కిందట వ

పేరుకు ఐఆర్ఎస్ అధికారి. అయితే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. కానీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్‌ చెందిన 27 ఏళ్ల శ్రావణికి- కోటపాటి వంశీకృష్ణతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌ కేడర్‌కి చెందిన వంశీకృష్ణ, ప్రస్తుతం విజయవాడలోని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇతనిని వివాహ సందర్భంగా రూ.10 లక్షల కట్నంతో పాటు 40 సవర్ల బంగారం, రూ.60లక్షల విలువైన ఫ్లాటును కట్నంగా ఇచ్చారు. 
 
అయితే వివాహమైన కొద్దిరోజులకే భార్య శ్రావణిని అత్తమామలతో పాటు భర్త కూడా మానసికంగా వేధించడం మొదలెట్టారు. ఒకానొక దశలో వంశీకృష్ణ పేరెంట్స్ అపస్మారక స్థితిలోకి వెళ్లాలా కొట్టారని బాధితురాలు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వంశీకృష్ణకు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి శైలిలో మార్పు రాలేదు. చివరకు ఈనెల 14న వంశీకృష్ణ, అతడి పేరెంట్స్, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతనితోపాటు కుటుంబసభ్యులు ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.