శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (13:46 IST)

భారతీయ వంటకాలతో పోస్టల్ స్టాంపులు.. తిరుపతి లడ్డూకు స్టాంప్

తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ తంతి తపాలా శాఖ తాజాగా భారతీయ వంటకాలతో కూడిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. ఇందులో 24 భారతీయ వంటకాలకు చోటుదక్కింది.

తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ తంతి తపాలా శాఖ తాజాగా భారతీయ వంటకాలతో కూడిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. ఇందులో 24 భారతీయ వంటకాలకు చోటుదక్కింది. 
 
అలాగే, హైదరాబాద్‌కే ట్రేడ్ మార్క్‌గా చెప్పుకునే బిర్యానీ, పసందైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదానికి కూడా ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ 24 వంటకాల్లో నాలుగు రకాల తెలుగింటి వంటకాలు ఉన్నాయి. ఈ మేరకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం ఈ స్టాంపులను విడుదల చేసింది. 
 
హైదరాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డు, ఆంధ్ర ప్రత్యేక వంటకాలైన ఇండ్లి దోశ, పొంగల్ ఫొటోలతో ఉన్న స్టాంపులను ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది. అయితే హైదరాబాదీ బిర్యానీని చేర్చడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపన, గోల్కొండ కోట నిర్మాణానికి మరో రెండు నెలల్లో 500 ఏళ్లు పూర్తవుతాయి. 
 
ఈ 500వ వార్షికోత్సవం సందర్భంగా కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలకు ఇష్టమైన, రాయల్ వంటకంగా భావించే బిర్యానీని గౌరవిస్తూ పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. తిరుపతి ప్రసాదం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా స్టాంపుతో గౌరవించారు.