సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: ఆదివారం, 12 నవంబరు 2017 (17:31 IST)

ఏపీ అసెంబ్లీలో నాకు నిద్రొస్తోంది - బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(వీడియో)

ఎప్పుడూ ఏదో ఒకవిధంగా వార్తల్లో ఉండే బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి అలాంటి పనే చేశారు. 10వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపి హాజరుకాలేదు. దీంతో అధికార పార్టీ సభ్యులతోనే సభ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు లేక

ఎప్పుడూ ఏదో ఒకవిధంగా వార్తల్లో ఉండే బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి అలాంటి పనే చేశారు. 10వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపి హాజరుకాలేదు. దీంతో అధికార పార్టీ సభ్యులతోనే సభ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు లేకుండడంతో సభ ప్రశాంతంగా ఉందంటూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తే బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం తనకు నిద్రొస్తోందనీ, ప్రతిపక్ష పార్టీ సభలో లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.
 
గతంలో కూడా జగన్, వైసిపి ఎమ్మెల్యే రోజా, బొత్స సత్యనారాయణ, పార్థసారథి లాంటి నేతలపై తీవ్రస్థాయిలో బిజెపి నేత విమర్శలు చేశారు. బిజెపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అటు సభను అవమానించినట్లు కొంతమంది భావిస్తున్నారు.