శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (16:39 IST)

ముద్రగడ ఆ మాట అనగానే ఆశ్చర్యపోయా.... నెం.1 చానల్ ఎండీ సుధాకర్ నాయుడు, డ్రోన్ కెమేరాలతో...

కాపు రిజర్వేషన్ల డిమాండుతో తుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం రెచ్చగొట్టడం వల్లే గొడవంతా జరిగినట్లు నెం.1 టీవీ ఎండీ సుధాకర్ నాయుడు చెప్పినట్లు సమాచారం. సీఐడి ముందు విచారణకు వెళ్లిన ఆయన పలు విషయాలను వారి ముందు చెప్పినట్లు తెలుస్తోంది.

కాపు రిజర్వేషన్ల డిమాండుతో తుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం రెచ్చగొట్టడం వల్లే గొడవంతా జరిగినట్లు నెం.1 టీవీ ఎండీ సుధాకర్ నాయుడు చెప్పినట్లు సమాచారం. సీఐడి ముందు విచారణకు వెళ్లిన ఆయన పలు విషయాలను వారి ముందు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తుని వద్ద కాపు రిజర్వేషన్ల కోసం సభ జరుపుతున్నామనీ, దానికి తన మద్దతు కావాలని ముద్రగడ చెప్పినట్లు ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
ఐతే సభ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ముద్రగడ అంతా రైల్వే ట్రాకు పైకి వెళ్లాలంటూ పిలుపునివ్వడంతో అక్కడ యువతతోపాటు తను కూడా ఆశ్చర్యానికి లోనయ్యానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. అలా పిలుపునివ్వడంతో అంతా రైల్వే ట్రాకుపైకి వెళ్లారనీ, ఆ తోపులాటలో తనకు గాయాలయినా తనను ముద్రగడ పట్టించుకోలేదని ఆయన సీఐడి ముందు వాపోయినట్లు సమాచారం. 
 
ఇకపోతే గొడవ తాలూకు దృశ్యాలను వీడియోలో బంధించేందుకు హైదరాబాదు నుంచి డ్రోన్ కెమేరాలను కొనుగోలు చేశారని చెప్పారు. ఆ డ్రోన్ కెమేరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తనకు తెలియదన్నారు. హైదరాబాదు నుంచి ముద్రగడకు ఆర్థిక సాయం అందిందనీ, భూమన కరుణాకర్ రెడ్డిని ముద్రగడ ఎలా ఉపయోగించుకున్నారో తనకు తెలియదనీ సుధాకర్ వెల్లడించారు. అసలు ముద్రగడ కాపు రిజర్వేషన్ల సాధన కోసం పిలిస్తే వెళ్లి అనవసరంగా ఈ కేసుల్లో ఇరుక్కున్నామని చాలామంది బాధపడుతున్నారని సుధాకర్ వెల్లడించినట్లు సమాచారం.