శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 27 మే 2017 (15:35 IST)

వివాహేతర సంబంధం... మా సోదరి ఆస్తంతా కాజేస్తాడని నరికేశాం... (video)

కడప ప్రొద్దుటూరులో పట్టపగలే అందరూ చూస్తుండగానే 34 ఏళ్ల మారుతీ ప్రసాద్ రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యలో పాల్గొన్న నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఐతే హత్యకు కారణం ఫ్యాక్షన్ గొడవలని ముందు అనుకున్న

కడప ప్రొద్దుటూరులో పట్టపగలే అందరూ చూస్తుండగానే 34 ఏళ్ల మారుతీ ప్రసాద్ రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యలో పాల్గొన్న నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఐతే హత్యకు కారణం ఫ్యాక్షన్ గొడవలని ముందు అనుకున్నారు కానీ అది కాదని తేలింది. మారుతీ ప్రసాద్ రెడ్డిని హత్య చేయడం వెనుక అతడి సోదరి వివాహేతర సంబంధం అని పోలీసులు తెలిపారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... దేవగుడికి చెందిన 34 ఏళ్ల బోరెడ్డి మారుతీ ప్రసాద్‌రెడ్డి సోదరి, శాస్త్రినగర్ నివాసి అయిన అనూరాధ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం చంద్రశేఖర రెడ్డి భార్యకు తెలిసింది. దీనితో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు ఇలా జరుగుతుండగానే తన సోదరి వివాహేతర సంబంధానికి మద్దతు తెలుపడమే కాకుండా చంద్రశేఖర రెడ్డి భార్య నిర్మలను బెదిరిస్తూ అనురాధా సోదరుడు మారుతీ ప్రసాద్ ఈ విషయంలో తలదూర్చాడు. 
 
అంతేకాదు 2014లో నిర్మల కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వెనుక కూడా మారుతీ ప్రసాద్ రెడ్డి హస్తముందని నిర్మల సోదరులు భావించారు. ఇక అతడిని చంపితేనే అన్ని సర్దుకుంటాయని నిర్ణయానికి వచ్చారు నిర్మల సోదరులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి. పైగా బావ చంద్రశేఖర రెడ్డి ఆస్తిని క్రమంగా అనురాధకు ధారాదత్తం చేయడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోయారు. ఇక మారుతీ ప్రసాద్ రెడ్డి హత్య ఒక్కటే మార్గమని నిర్ణయించుకుని పథకం పన్నారు. 
 
ఐతే విషయం పోలీసులకు తెలియడంతో గత నెల ఏప్రిల్‌లో రఘునాథరెడ్డి, పట్నం ధరణి, వెంకటరమణలను అరెస్ట్‌ చేసి రిమాండు విధించారు. ఐతే వీరు మే నెల 19న విడుదలయ్యారు. దీంతో మళ్లీ మారుతీ ప్రసాద్ రెడ్డిని చంపేందుకు పథకం పన్నారు. పక్కాగా ప్రణాళిక రచించి 2014లో ఓ కేసుకు సంబంధించి మారుతీ ప్రసాద్ రెడ్డి కోర్టుకు వస్తాడని తెలుసుకుని మాటు వేసి అతడిని నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగా అత్యంత దారుణంగా నరికి చంపారని తెలియజేశారు పోలీసులు. కాగా ఈ కేసుకు సంబంధించి మరికొందరి హస్తం వున్నట్లు అనుమానం వుందనీ, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.