సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (18:17 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు

Rains
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో..  గురు, శుక్రవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. 
 
నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్న కారణంగా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. 
 
ఈవానలకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. 
 
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉందని అమరావతి వాతావరణకేంద్రం వెల్లడించింది.